Leading News Portal in Telugu

వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్! | WhatsApp tests new features


posted on Aug 20, 2024 6:22PM

తన వినియోగదారుల భద్రత, ప్రైవసీని పెంచడం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ వుంటుంది. ఇప్పుడు మొబైల్ నంబర్‌తో అవసరం లేకుండానే మెసేజ్ చేసే సదుపాయాన్ని తెచ్చే ప్రయత్నంలో వాట్సాఫ్ వుంది. ‘యూజర్ నేమ్’ పేరుతో తీసుకురాబోయే ఈ ఫీచర్‌తో ఫోన్ నంబర్‌తో అవసరం లేకుండా వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు. ‘యూజర్ నేమ్’ ఫీచర్ వల్ల ఉపయోగాలు ఏమిటంటే, కొత్తగా పరిచయం అయిన వ్యక్తులకు మన ఫోన్ నంబర్ ఇవ్వాలంటే సంకోచించడం సహజం. ఈ ‘యూజర్ నేమ్’ ఫీచర్ వల్ల కొత్తవారికి మన ఫోన్ నంబర్ ఇవ్వకుండానే వారి నుంచి మనం మెసేజ్‌లు తీసుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ ఫీచర్ ద్వారా నియంత్రించవచ్చు.