Leading News Portal in Telugu

చంద్రబాబుతో మంద కృష్ణమాదిగ భేటీ! | manda krishna met chandrababu| chandrababu manda krishna


posted on Aug 24, 2024 6:34PM

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మాదిగ నాయకుడు మంద కృష్ణమాదిగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మంద కృష్ణ మాదిగ చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆమోదించిన వెంటనే మండ కృష్ణ ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు చొరవ వల్లే వర్గీకరణ సాధ్యమైందని, గతంలో కూడా చంద్రబాబు వల్లే ఎంతోమంది దళితులకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపినప్పుడు, మాదిగల అభ్యున్నతికి కట్టుబడి వున్నానని, మాదిగల సంక్షేమం విషయంలో తాను పెద్ద మాదిగలా పనిచేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు.