Leading News Portal in Telugu

జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే


posted on Aug 24, 2024 1:16PM

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కొంతకాలంగా పలు కేసుల్లో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలు కండీషన్లతో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జైలులో నుంచి బయటకి వచ్చిన వెంటనే‌ పిన్నెల్లి హడావిడిగా కారులో మాచర్లకి బయలుదేరి వెళ్లారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి యత్నించడం వంటి కేసుల్లో ఆయన సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు నిన్న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే హడావుడిగా తన వాహనంలో ఆయన మాచర్లకు బయల్దేరారు. మరోవైపు పిన్నెల్లి విడుదలవుతున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు జైలు వద్దకు వెళ్లారు.