Leading News Portal in Telugu

తెలంగాణ టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ! | chandrababu meeting with ttdp leaders


posted on Aug 25, 2024 4:52PM

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి  అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరన్నది పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, చంద్రబాబు మనసులో మాటమాత్రం బయటపడలేదు.