posted on Aug 28, 2024 12:23PM
తెలంగాణ తల్లి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో స్వల్ప మార్పులు చేశారు. సచివాలయం లోపల శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగివంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమి పూజలో పాల్గొన్నారు. కొత్త తెలంగాణ తల్లి నమూనా చిత్రం ఇంత వరకు విడుదల కాలేదు సచివాలయం మెయిన్ ఎంట్రెన్స్ సింహ ద్వారం వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. డిసెంబర్ 9నాడు తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవం ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినంరోజు విగ్రహం ఆవిష్కరించాలని రేవంత్ సర్కారు కృత నిశ్చయంతో ఉంది. మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి , ఎమ్మెల్యే దానం నాగేందర్, కె. కేశవరావ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గత ప్రభుత్వం అగౌరవ పరిచేలా రోడ్డు మీద నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం లోపల గౌరవంగా నిలబెట్టిందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.