Leading News Portal in Telugu

వామ్మో.. ఎంపీకి 908 కోట్ల జరిమానా! | dmk mp jagadrakshakan fine| ed fine to dmk mp jagadrakshakan


posted on Aug 29, 2024 3:51PM

అసలు 908 కోట్లేంటండీ బాబు.. పైగా అది కూడా జరిమానా.. పైగా మన భారతీయ ఎంపీకి! సదరు ఎంపీ 908 కోట్లు జరిమానాగానే కట్టే స్థాయిలో వున్నాడంటే, ఆయన గారి అసలు ఆస్తి ఎంత వుంటుందో కదా..! ఇంతకీ ఎవరా ఎంపీ, అంత జరిమానా ఎవరు విధించారు? ఎందుకు విధించారు? ఆ వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని అర్కోణానికి చెందిన డీఎంకే పార్టమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్‌కి ఈడీ (ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్) 908 కోట్ల జరిమానా విధించింది. ఈ ఎంపీ మీద మనీలాండరింగ్ కేసు వుంది. ఈ కేసు విషయంలో 2020లో ఈయన ఇల్లు, ఇతర ప్రాంతాల మీద ఈడీ సోదాలు నిర్వహించి దాదాపు 90 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. జగద్రక్షన్‌కి చెందిన సంస్థలు, పరిశ్రమలు పన్నులు సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిర్వహణ చట్టం కింద జగద్రక్షన్‌కి ఈడీ 908 కోట్ల రూపాయల జరిమానా విధించింది.