Leading News Portal in Telugu

హైడ్రా పేరుతో అవినీతా? తాట తీస్తా! | corruption in the name of hydra


posted on Aug 29, 2024 5:21PM

హైదరాబాద్ నగరంలో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. చెరువులున్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించిన వారు భయపడి  చస్తున్నారు. ఈ భయాన్ని కొంతమంది అధికారులు క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళ తాట తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. హైడ్రా పేరుతో చెప్పి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చింది రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు. ప్రజలకు భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.