Leading News Portal in Telugu

వైసీపీలో మరో రెండు వికెట్లు..! | resigns in ycp| ycp resigns


posted on Aug 30, 2024 1:53PM

జగన్ పార్టీలో రాజీనామాల పండగ కొనసాగుతోంది. ఒక పక్క లండన్ వెళ్తూ ఏపీకి బైబై చెప్పడానికి రెడీ అవుతుంటే, మరోపక్క రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ‘పార్టీ’ సంగతి తర్వాత, నాకు నా కూతురు పుట్టిన రోజు ‘పార్టీ’యే ముఖ్యమని జగన్ ఈ రాజీనామాలని లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖలు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ జగన్ లండన్‌కి వెళ్ళడం అంటూ జరిగితే, ఆయన ఇరవై రోజుల తర్వాత ఆయన ఒకవేళ తిరిగి వస్తే, ఇక్కడ ఖాళీ వైసీపీ స్వాగతం పలికేట్టు వుంది.