Leading News Portal in Telugu

పెళ్లికూతురు పసుపు రాసుకోవచ్చా?  | Can the bride wear turmeric?


posted on Aug 30, 2024 10:37AM

మౌలానా ఇంటికి వచ్చాడు సిరాజ్. అదే బస్తీలో ఉండటంతో సిరాజ్ కుటుంబానికి మౌలానా చిరపరిచుతుడే. 

సిరాజ్: సలాం వాలేకుం మౌలానా సాబ్.

మౌలానా: వాలేకుం సలాం. తష్రీప్ రఖియే (దయచేసి కూర్చోండి)

  తన చెల్లెలు రుబీనా పెళ్లి కార్డు ఇవ్వడానికి మౌలానా వద్దకు వచ్చాడు. షాదీ (పెళ్లి), వలీమా(విందు) కు ఆహ్వానిస్తాడు. మౌలానా ఆశ్యర్యపోయాడు. కేవలం రెండ్రోజులకే పెళ్లి వేడుక జరపడం తగదని వారించాడు. నేను నిఖా రోజు, విందు రోజు వస్తాను కానీ మీ ఇంట్లో పెళ్లి వేడుకలు వారం రోజులు జరుపుకోవాలని మౌలానా కోరతాడు. 

సిరాజ్: ఇటీవల మా అన్నయ్య ఫసల్ బాబా పెళ్లి ఖర్చు బాగా అయ్యింది కదా మౌలానాసాబ్ 

 

మౌలానా: బడే లోగ్  జో బీ కరే అచ్చే ఇచ్  కరే.

సిరాజ్ : క్యా కరే మౌలానా సాబ్ 

మౌలానా:  ‘బాజూ వాలా మౌలానా నహీ ముహీమ్ నికాలే సుబామే షాదీ, ష్యామ్ మే వలీమా ఏకీ దిన్ మే నిఖా, వలీమా కర్దోవ్’ యే క్యా జులుమ్ . బహుత్ జులుమ్ హై  భాయ్ యే … ఇత్ నాబీ నై కర్నా టూమచ్ హై .. ఏక్ దిన్ మే షాదీ , వలీమా

ఖర్చులు పెరిగిపోతున్నాయన్న సాకుతో ఒకే రోజు పెళ్లి , విందు నిర్వహించే క్రతువును మౌలానా వ్యతిరేకించేవాడు. ఇస్లాంలో పెళ్లిని  ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలి. కనీసం వారం రోజుల పాటు పెళ్లి జరగాలి. దుబారా ఖర్చులు తగ్గించి పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మౌలానా తన తక్రీర్ (ప్రవచనాల్లో) చెప్పేవాడు. ఇస్లాంలో హల్దీ(పసుపు) వేడుక కంపల్సరీ కాదు కానీ దక్షిణ భారత దేశ సంస్కృతిలో హల్దీ వేడుక చేరింది.  ఐదు రోజుల పాటు జరిగే హల్దీ వేడుక ప్రాధాన్యత సంతరించుకుంది. పసుపు వల్ల చర్మంలో నిగారింపు వస్తుందని మౌలానా శాస్త్రీయ ఆధారాలను చూపెట్టాడు. తొలుత అమ్మాయిలకు మాత్రమే పసుపు రాసే వారు. ప్రస్తుతం అబ్బాయిలకు కూడా పసుపు రాస్తున్నారు. పసుపు తిన్నా, శరీరానికి రుద్దినా మంచిదే. కరోనా సమయంలో  పసుపును విరివిగా ఉపయోగించడం వల్ల మహమ్మారిని నివారించగలిగాం అని తన తక్రీర్ లలో మౌలానా చెప్పేవాడు. పెళ్లి కొడుకుకు పసుపు రాయడం వల్ల చర్మం నుంచి దుర్వాసన తొలగిపోతుంది.నిగారింపు వస్తుంది.  పెళ్లి కొడుకు కు మెహందీ (గోరింటాకు) పెట్టడవ నిషేధం. పెళ్లికూతురుకు అయితే  రక్త సంబంధీకులు మాత్రమే పసుపు రాయాలి.  కుటుంబయేతర మహిళ లేదా యువతి చేత పసుపు రుద్దించకూడదు.  అమ్మాయిల కాలి బొటనవేలి నుంచి మెడ వరకు పసుపు రుద్దకూడదు.మహిళల ఎదుట కూడా పెళ్లికూతురు కొన్ని హద్దుల్లో మాత్రమే పసుపు రాసుకోవాలి. వివస్త్రగా పసుపు రాసుకోకూడదు. పసుపు పెట్టుకుని డాన్స్ లు చేయడం ఇస్లాంలో నిషిద్దం. పెళ్లికూతరే స్వయంగా పసుపు రాసుకోవడం ఉత్తమం.వేరే మహిళలు పసుపు రాయడం కూడా ఇస్లాంలో నిషిద్దం.   పెళ్లి వేడుకను వారం రోజుల పాటు కుటుంబసభ్యులు బంధు మిత్రుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని, అప్పుడే వారి కుటుంబం పదికాలాల పాటు చల్లగా ఉంటుందని ఇస్లాం చెబుతుందని మౌలానా వివరించాడు. 

 -బదనపల్లి శ్రీనివాసాచారి