Leading News Portal in Telugu

కాలవలోకి దూసుకెళ్లిన ఆటో.. స్కూలు పిల్లలకు తప్పిన ముప్పు | auto runs in cannal| driver| loose| contron| miserable| road| school| children| narrow


posted on Aug 31, 2024 11:19AM

ఆంధ్రప్రదేశ్ లో స్కూలు పిల్లలతో వెడుతున్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. అయితే ఆటో ఒక పక్కకు ఒరిగి నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మచలీపట్నంలో జరిగింది.  

దాదాపు 20 మంది చిన్నారులతో కొన గ్రామానికి వెడుతున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది. ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో వేగాన్ని పూర్తిగా నియంత్రించడంతో ఆటో కాలువలో పడిపోకుండా పక్కకు ఒరిగి ఆగిపోయింది.

దీంతో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి కోన రహదారి గుంతలమయంగా ఉండటమే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆటోలో 20 మంది పిల్లలు ఉన్నారు.  ఇప్పటికైనా కోన రహదారికి మరమ్మతులు చేయాలనీ, అలాగే రోడ్డు వైడెనింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.