posted on Sep 1, 2024 7:12AM
బగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుపానుగా మారిన వాయుగుండం శనివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి దాటిన తరువాత ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరం దాటి బలహీనపడింది. అయితే ఈ తుపాను ప్రభావంతో ఆదివారం (సెప్టెంబర్ 1) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.