posted on Sep 2, 2024 5:38PM
తెలంగాణకు భారీ వర్షాల నుంచి ఊరట లభించింది మంగళవారం నుంచి… తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు నుంచి రేపటి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈదురు గాలులు బలంగా వేయనున్నాయి. తెలంగాణ ప్రాంతంలో అన్ని చెరువులు నిండిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగడంతో పలువురు మృత్యువాత పడటంతో సోమవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే అనూహ్యంగా వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయని వెదర్ రిపోర్ట్ రావడం పట్ల పలువురు హర్షం వెలిబుచ్చారు.