posted on Sep 4, 2024 5:43PM
వరంగల్ జిల్లాకు తొలి మహిళా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రాపాలి ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమ్రాపాలికి కీలక బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రాపాలి మరో మారు వివాదంలో చిక్కుక్కున్నారు. తెలంగాణ హైకోర్టు ఆమ్రాపాలికి నోటీసులు జారీ చేసింది. ఆమ్రాపాలి ఆదేశాలమేరకు జూబ్లిహిల్స్ లో గ్రయినేట్ రాయి పేలుళ్లు జరుగుతున్నాయి. అత్యధిక డెసిబుల్స్ తో సౌండ్ వెదజల్లడంతో స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జిహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ నేపథ్యంలో సదరు అధికారిణి ఆమ్రాపాలికి నోటీసులు జారి అయ్యాయి. ఆమెతో పాటు పర్యావరణ, భూగర్భ గనుల శాఖల ముఖ్యకార్యదర్శులకు కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.