Leading News Portal in Telugu

సైకో జగన్ ఎందుకిలా తయారయ్యాడు? | why psycho jagan becomes like this| psycho jagan


posted on Sep 4, 2024 5:59PM

ఏ సందర్భంలో అయినా కామెడీగా మాట్లాడి, కామెడీ పనులు చేసే కేఏ పాల్‌కి వున్న బుద్ధిలో ఐదు పైసలు వంతు బుద్ధి కూడా జగన్‌కి లేదు. విజయవాడ వరద బాధితులను పరామర్శించడానికి విజయవాడకి వచ్చిన కేఏ పాల్ సిట్యుయేషన్‌నిబట్టి చాలా పద్ధతిగా మాట్లాడారు. ఈ వరదలు ఊహించనివని, వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం సాయం చేయాలని కోరారు. ఇలాంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడ్డం న్యాయం కాదని అన్నారు. మరి సైకో జగన్ ఏం చేశాడు? నీచ నికృష్టంగా మాట్లాడాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరద వచ్చిందట. చంద్రబాబు నాయుడు ఇల్లుని కాపాడ్డం కోసం బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్లే వరద వచ్చిందట. ఈ వాయీ వివరం తెలియని సన్నాసికి నోటికొచ్చినట్టు వాగడం తప్ప ఏదీ తెలిసి చావదు. తాను అబద్ధాలు మాట్లాడితే దొరికిపోతానేమోనన్న సిగ్గూ శరం ఈ తుమ్మ మొద్దులో ఏ కోశానా వుండవు. చంద్రబాబు ఇల్లు కృష్ణానదికి ఇటుపక్క వుంది. బుడమేరు అటుపక్క ఎక్కడో వుంది. బుడమేరు పొంగితే విజయవాడ నగరంలోకి నీరు వస్తాయి. ఇంకా పొంగితే ఆ నీరు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. అంతేతప్ప చంద్రబాబు ఇంటి వైపు చుక్క నీరు కూడా వెళ్ళదు. ఆ విషయం తెలిసి వాగాడో, తెలియకుండా వాగాడోగానీ మొత్తానికి నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అనే తరహాలో వాగేశాడు. ఇంకా, తన ఇంటి వైపు నీళ్ళు రాకుండా వుండాలని చంద్రబాబు బుడమేరు గేట్లు ఎత్తించేశాడట. అందువల్లే విజయవాడ మునిగిపోయిందట. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా అఘోరించిన ఈ చవట సన్నాసికి బుడమేరుకి గేట్లే లేవన్న విషయం తెలిసి చచ్చినట్టు లేదు. అందుకే నోటికొచ్చింది వాగేసి, కారెక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ బుధవారం నాడు మరోసారి జనం ముందుకు వచ్చాడు. తాను మంగళవారం వాగిన వాగుడుని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, ‘‘బుడమేరు నది’’ అన్నాడు. అసలు బుడమేరు అనే పేరులోనే ‘ఏరు’ అని వుంది. అది ఒక ఏరు మాత్రమే.. దాన్ని ఈయనగారు ‘నది’ చేసేశాడు. ఇదంతా చూస్తున్న జనం  ఏమి కర్మ పట్టింది రా రాష్ట్రానికి…  ఈ పిచ్చోడిని భారతీ రెడ్డి బయటకు ఎందుకు వదులుతున్నట్టు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అసలీ జగన్ కేరెక్టర్ ఇంత దారుణంగా తయారవడానికి, పెద్ద సైకోలాగా మారి, ఆంధ్రప్రదేశ్ నెత్తిన పెద్ద దరిద్రంలా మారడానికి అసలు కారణాలు ఏంటా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఆలోచించగా… ఆలోచించగా.. ఒకటే ఒక కారణం కనిపిస్తోంది. అదేంటంటే, ముఖ్యమంత్రి కావడానికి రకరకాల తంత్రాలు పన్నడంలో నిమగ్నమై వున్న ఆ మహామేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ జగన్ అనే మొద్దావతారాన్ని సరిగా పెంచలేదు. నీతి, నిజాయితీ, చట్టం, ధర్మం, న్యాయం… ఇలాంటి పదాల గురించి చెప్పేవాళ్ళు లేకపోవడంతో అసలు అలాంటివి వున్నాయనే విషయం తెలియకుండానే పెరిగినట్టున్నాడు. కనీసం సరిగ్గా చదువుకున్నా బుద్ధి బాగుపడేదేమో.. కానీ, ఈ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ఒక్కదాన్నే చదివినట్టున్నాడు. అందుకే ఇలా తయారయ్యాడు.