posted on Sep 5, 2024 10:43AM
బెజవాడను వరదలు ముంచెత్తిన ఆపత్సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులకు బాసటగా నిలిచారు. విజయవాడ చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో వరుసగా నాలుగు రోజుల పాటు బాధితులకోసం ఆహారాన్ని సిద్ధం చేయించి అందించారు. బుధవారం (సెప్టెంర్ 4) వరకూ 80 వేల మందికి పైగా ఆహారాన్ని అందించారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎన్డీయే కూటమి , వాలంటీర్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సమన్వయంతో రేయింబవళ్లు పనిచేసి బాధితులకు సహాయ సహకారాలు అందించారు. నిర్విరామంగా పని చేసి బాధితులకు ఆకలి బాధ లేకుండా చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, వాలంటీర్లు ట్రాక్టర్లలో ముంపు ప్రాంతాలలో పర్యటించి ఆహారాన్ని అందించారు. చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాజరాజేశ్వరి పేట, ఊర్మిళా నగర్, తదితర లోతట్టు ప్రాంతాలలో ముంపునకు గురైన ప్రజలకు ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను, అందించారు, 20,000 వేల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఇప్పటికే సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్లు పలు డివిజన్ల లో ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా నిరంతరాయంగా ఆహారాన్ని సిద్ధం చేస్తున్న వంటశాలను ఎమ్మెల్యే సుజనా బుధవారం పరిశీలించి పనులను పర్యవేక్షించారు.