Leading News Portal in Telugu

దళిత ప్రజాప్రతినిథులకు గౌరవం ఇవ్వరా? | no respect to dalit mlas| vemula| veeresham| rachakonda| commissioner| speaker


posted on Sep 5, 2024 3:21PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. దళిత ప్రజాప్రతినిధులకు అధికారులు గౌరవం ఇవ్వరా అన్న చర్చకు తెరలేపాయి. ఇంతకూ జరిగిందేమిటంటే.. వరదముంపు ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం తెలిపేందుకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెళ్లారు. మంత్రులకు స్వాగతం పలికేందుకు అనుమతి ఉన్న ఆరుగురిలో వేముల వీరేశం కూడా ఒకరు. అయితే పోలీసులు వేముల వీరేశాన్ని అడ్డుకున్నారు. అసలు వేముల వీరేశంను వారు గుర్తు పట్టలేదు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వేముల వీరేశం.. తోటి నాయకులు సముదాయించినా వినకుండా పోలీసులకు కామన్ సెన్స్ లేదంటూ వెనక్కు వెళ్లిపోయారు. వేముల వీరేశం ను పోలీసులు అడ్డకోవడం నాయకులనే కాదు, ప్రజలను కూడా నివ్వెర పరిచింది. కాగా పోలీసు అధికారులు తన పట్ల వ్యవహరించిన తీరుపై వైముల వీరేశం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను కలిసి  ప్రివేలేజ్ మోషన్ ఇచ్చారు.  

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి పర్యటన సందర్బంగా వారికి స్వాగతం తెలిపేందుకు హెలిప్యాడ్ దగ్గరికి ముందుగా పేర్లు నమోదైన ఆరుగురిలో ఉన్న ఎమ్మెల్యేగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా వెళ్లారు…అయితే అక్కడ పోలీసులు అధికారులు వీరేశంను గుర్తుపట్టకపోగా అడ్డుకునే ప్రయత్నం చేశారు…ఈ సంఘటన ప్రజాప్రతినిధులతో పాటూ… సామాన్య ప్రజలను కూడా నివ్వెరపోయేలా చేసింది. దీంతో పోలీసులపై మనస్తాపం చెందిన ఎమ్మెల్యే వీరేశం తోటి నాయకులు  సముదాయించినా వినకుండా పోలీసులకు కామన్ సెన్స్ లేదా అంటూ వెనక్కు వెళ్లిపోయారు. ఆర్టికల్ 19, 21,194 ప్రకారం… ఎమ్మెల్యే విధులు ఆటంకపరిచి , హక్కులు హరించినందుకు… అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మరే ఎమ్మెల్యేకూ జరగకూడదన్న ఉద్దేశంతోనే స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు వేముల వీరేశం తెలిపారు. ఇదంతా పక్కన పెడితే వేముల వీరేశంపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దళిత ప్రజాప్రతినిథులపై వ్యవహరించే తీరు అవమానకరంగా ఉంటుందనీ, వేముల వీరేశం పట్ల పోలీసుల అనుచితంగా ప్రవర్తించడం వెనుక సుధీర్ బాబు ఆదేశాలు ఉండి ఉంటాయనీ ప్రజా ప్రతినిథులలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ కూడా దళితుల పట్ల సుధీర్ బాబు ప్రవర్తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా ఆయన కొందరు అధికారులు దళిత ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిథుల పట్ల చాలా చులకనభావంతో వ్యవహరిస్తున్నారనీ, తమ ఫోన్లను ఆన్సర్ చేయరనీ, నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో తమ సూచనలను ఖాతరు చేయరనీ సత్యనారాయణ ఆరోపించారు. అసలు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దళిత ప్రజాప్రతినిథులతో అనుచితంగా, అగౌరవంతో వ్యవహరిస్తారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా వేముల వీరేశం విషయంలో అవమానకరంగా వ్యవహరించినది కింది స్థాయి పోలీసు అధికారులే అయినా వారికి డ్యూటీలు వేసి, ప్రొటోకాల్ ఆదేశాలు ఇచ్చేది కమిషనరేననీ, ఆయన ఆదేశాల మేరకే వేముల వీరేశంకు ప్రోటోకాల్ ఇవ్వకుండా అవమానించారనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేముల వీరేశం కూడా స్వయంగా అవే ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అవమానానికి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబే బాధ్యత వహించాలని మీడియా ముఖంగా చెప్పారు. 

జిల్లాలో ఒకరిద్దరు బడా నేతల కనుసన్నలలో  ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల్లో వీరేశంను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతున్నదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.  ఎమ్మెల్యే అయితే మాకేంటీ అన్నట్లుగా కొందరు అధికారులు ఒకరిద్దరు నేతల తీరు ఉందని స్వయంగా వీరేశం వాపోతున్నారు.  అయితే ఆ బడానెతలెవరు, కాంగ్రెస్ వారా, వేరే పార్టీకి చెందిన వారా అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  వీరేశం   తన మాట తీరుతో, డైనమిక్ నిర్ణయాలు,   ప్రజాసేవ ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ కారణంగానే ప్రజలలో ఆయన పలుకుబడిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయవర్గాలలో టాక్ నడుస్తోంది.  మరోవైపు ఎమ్మెల్యేల నుండి ఫిర్యాదు అందుకున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయినా చర్యలకు ఉపక్రమిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.