Leading News Portal in Telugu

భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ | monkeypox enter india| union| health| ministry| alert| caution


posted on Sep 10, 2024 9:46AM

ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ భారత్ లోకి ఎంటర్ అయ్యింది. భారత్ లో మంకీ పాక్స్ తొలి కేసు నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ధృవీకరించింది.   ఇటీవలే ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని వెల్లడించింది.  ఆ వ్యక్తి పేరు వివరాలు వెల్లడించలేదు. అయితే దేశంలో మంకీపాక్స్ విస్తరణ నిరోధానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే దేశంలో దేశంలో మంకీపాక్స్‌ క్లస్టర్లను గుర్తించడానికి నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ పని చేస్తోందని  పేర్కొంది. 

ఎయిర్‌ పోర్టుల్లో మంకీపాక్స్‌ స్క్రీనింగ్‌ మరింత వేగవంతం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో  పరిశోధనాశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు తెలపింది. రాష్ట్రాలు చర్మ, ఎస్‌టీడీ లాంటి రోగాలకు చికిత్స చేసే క్లినిక్స్ పై దృష్టి పెట్టాలని తెలిపింది. వ్యాధి లక్షణాలు కనిపించిన పేషెంట్ల విషయంలో అలర్ట్ గా ఉండాలనీ, మంకీపాక్స్  వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, ప్రజల్లో అనవసర భయాలు పొగేట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన ప్రకటనలో తెలిపింది. మంకీపాక్స విస్తరణను నిరోధించేందుకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.