Leading News Portal in Telugu

లాస్ వెగాస్ ఐటీ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం | invitation tocbn for it serve alliance| laovegos| chief| guest


posted on Sep 10, 2024 2:57PM

అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల కన్సార్షియం  ఐటీసర్వ్ అలయెన్స్   వార్షిక సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడికి ఆహ్వానం అందింది. అలాగే ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూ సదస్సు నిర్వాహకులు ఆహ్వానించారు.   సినర్జీ’ పేరుతో నిర్వహించే ఈ సదస్సు అక్టోబరు 29, 30 తేదీల్లో లాస్ వేగాస్ లో జరుగుతుంది. 

ఈ సదస్సుకు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల వచ్చిన ఆహ్వానం కాదు ఇది. ప్రపంచంలో ఎక్కడైనా సరే  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అన్న మాట ఎత్తగానే వినిపించే పేరు సీబీఐ. ఐటీ పరిశ్రమ విస్తరణకు, ప్రపంచ ఐటీ రంగంలో తెలుగు వెలుగుకు, తెలుగు ప్రభకు ఆద్యుడు చంద్రబాబు. అందుకే టెక్నాలజీకి సంబంధించిన ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందుతుంది. ఆయన సెంట్రిక్ గానే సదస్సులు జరుగుతాయి. 

 ఎప్పుడో ఎప్పుడో, పాతికేళ్లకు ముందే కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు  నాటిన ఐటీ విత్తనం, ఇప్పుడు మహావృక్షమై నిలిచింది. ఐటీ అంటే  చంద్రబాబు చంద్రబాబు అంటే ఐటీ అన్నంతగా ఆ రంగంలో ఆయన అనితర సాధ్యమైన ప్రాధాన్యత సంతరించుకున్నారు. అందుకే సినర్జీ సదస్సుకు ముఖ్యఅతిథిగా చంద్రబాబుకు ఆహ్వానం అందించి. ఇక లోకేష్ కు అందిన ఆహ్వానం కూడా ఆయనకు ఐటీ రంగంలో ఉన్న నైపుణ్యత, అనుభవం, ప్రపంచ దేశాల ఐటీ కంపెనీలతో గతంలో మంత్రిగా ఉన్న సమయంలో నవ్యాంధ్రకు ఐటీ పరిశ్రమ తరలి రావడానికి బాటలు పరిచారు.  

ఇక ఐటీసర్వ్ అలయెన్స్ సదస్సు ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సదస్సుకు ప్రపంచం నులమూలల నుంచీ పాతిక వందలకు పైగా ఐటీ కంపెనీల ప్రతినిథులు హాజరౌతారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలు, ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలు జరుగుతాయి.అందుకే ఐటీసర్వ్ అలయెన్స్ ప్రతినిథులు స్వయంగా కలిసి ఆహ్వాన పత్రం అందించగానే లోకేష్ మరో ఆలోచన లేకుండా తాను సదస్సకు హాజరౌతానని అంగీకారం తెలిపారు.

  విజయవాడ వరద బాధితుల సహాయార్థం రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.  సుమారు 2,500 చిన్న, మధ్యతరహా ఐటీ స్టాఫింగ్, సర్వీసెస్ కంపెనీలతో ఏర్పాటైన కన్సార్షియం ఈ ఐటీ సర్వ్. ఈ కన్సార్షియంలోని కంపెనీల  వార్షిక ఆదాయం 1,000 కోట్ల అమెరికా డాలర్లు. 

‘సినర్జీ-2024లో వివిధ రంగాలను ప్రభావితం చేసే గొప్ప నాయకులు, ఇన్నోవేటర్స్, అనేక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు పాల్గొంటారు. విజన్, డెవలప్ మెంట్, ఆవిష్కరణలకు చంద్రబాబు మార్గదర్శి అంటూ సినర్జీ ప్రతినిథులు ఆయనకు ఇచ్చిన ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఐటీ హబ్, ఆర్థిక పురోభివృద్ధికి కేంద్రంగా మార్చిన చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా విజనరీగా గుర్తింపు ఉంది. 

ముఖ్యంగా హైదరాబాద్ ను టెక్నాలజీ పవర్హౌస్ మార్చడంలో చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిదనడంలో సందేహం లేదు. అటువంటి దార్శనిక నేత  చంద్రబాబును సినర్జీకి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం ఆశ్చర్యమేమీ కాదు.