Leading News Portal in Telugu

జగన్ పాస్ పోర్టు రెన్యువల్ కు హైకోర్టు అనుమతి | respite to former jagan in high court| pass| port| renewal| five


posted on Sep 11, 2024 12:23PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు హై కోర్టులో ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు రెన్యువల్ విషయంలో జగను అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ పాస్ పోర్టు రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే జగన్ కోరిన విధంగా ఐదేళ్ల రెన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో జగన్ లండన్ యానానికి అడ్డంకులు తొలగిపోయినట్లైంది. దీంతో ఆయన ఏ క్షణంలోనైనా లండన్ యాత్రకు బయలుదేరే అవకాశం ఉంది.  

ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ కు ఉన్న డిప్లమేటిక్ పాస్ పోర్టు ఆయన అధికారం కోల్పోగానే ఆటోమేటిక్ గా రద్దైంది. దీంతో ఆయన సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఆయన ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజాప్రతినిథుల కోర్టు మాత్రం జగన్  పాస్ పోర్టు కాల పరిమితిని ఏడాదికి కుదించింది. దీంతో ప్రజాప్రతినిథుల కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు ఐదేళ్ల గడువుతో పాస్ పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.