TeluguOne News | Regional News | AP News | AP Political News | Regional News | Telugu Cinema News | Telugu Cinema Gossip – Political News – Headlines – Political Gossip – International – Top Stories
posted on Sep 18, 2024 12:26PM
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్నంతకాలం ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బార్ సందర్భంగా ప్రజలు నేరుగా లోకేష్‌ని కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు తమకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ప్రజాదర్బార్ సందర్భంగా లోకేష్ దగ్గరకి వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గాల బాధితులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వారి సమస్యలను ఓపిగ్గా వింటున్న లోకేష్, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. అలాగే ప్రజల నుంచి తనకు అందుతున్న వినతిపత్రాలను సంబంధిత మంత్రులు, అధికారులకు అందిస్తూ, ఆయా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారాలు చూపించాలని లోకేష్ ఆదేశిస్తున్నారు.