posted on Sep 24, 2024 12:46PM
ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. కాగా తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భక్తులు తిరుమల దేవునిపై భక్తి విశ్వాసాలతో ఇచ్చిన ఆస్తులను నిరర్ధక ఆస్తులుగా టీటీడీ గత పాలక మండలి వాటిని అమ్మే ప్రయత్నం చేసిందని విమర్శించారు. జగన్ హయాంలో తిరుమల పవిత్రత దెబ్బతిందన్నారు.