posted on Sep 24, 2024 1:35PM
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుచి గజ్జల వెంకట లక్ష్మీరెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో వుండగా ఆమె ఆ పదవిలో నియమితులయ్యారు. తెలుగుదేశం నాయకుల మీద ముఖ్యంగా మహిళా నాయకుల మీద నోరు పారేసుకున్న అర్హత మీద ఆమె ఆ పదవిని సంపాదించారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటికీ ఆమె తన పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారు. ఇటీవల ముంబై హీరోయిన్ జెత్వానీ విషయంలో కూడా ఆమె వివాదాస్పద కామెంట్లు చేశారు. ఆమె ముంబైకి చెందిన మహిళ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.