posted on Sep 24, 2024 6:56PM
వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీసీల నాయకుడైన ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వైఎస్ జగన్ ఆయనను తన పార్టీ తరఫున రాజ్యసభకు పంపించారు. జగన్ కష్టకాలంలో కృష్ణయ్య కూడా జగన్‌కి షాక్ ఇచ్చారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై కొట్టిన సంగతి తెలిసిందే.