posted on Sep 25, 2024 1:03PM
అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థులు టార్గెట్ గా జరుగుతున్న కాల్పులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కార్యాలయంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అరిజోనాలోని ఆమె ప్రచార కార్యాలయంపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పై కూడా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కాల్పుల్లో ట్రంప్ స్వల్పంగా గాయపడ్డారు. ఆ తరువాత కూడా ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరిగాయి. ఆయన గోల్ఫ్ ఆడుతుండగా అక్కడకు తుపాకీతో వచ్చిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ట్రంప్ గాయాలేమీ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.