Leading News Portal in Telugu

కొండా సురేఖ రాజీనామా చేయాలి.. కేఏ పాల్ | konda surekha should resign


posted on Oct 3, 2024 2:41PM

సినీనటి సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ 72 గంటల్లో రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘పిచ్చి వాగుడు వాగి సారీ చెప్తే కుదరదు. రాజీనామా చేయకపోతే లీగల్‌గా ప్రొసీడ్ అవుతాను. కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల గౌరవముంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెంటనే సురేఖను పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలి. ఆమె చేసిన వ్యాఖ్యలతో సమంత ఎంతో క్షోభకు గురై ఉంటారు’ అని కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.