posted on Oct 4, 2024 1:17PM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి.ఈ నెల 12న చక్రస్నానంతో ముగుస్తాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి
చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి 7వ తేదీ వరకూ
తిరుమలపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించరు.