Leading News Portal in Telugu

డోన్ట్ వర్రీ.. అయాం సేఫ్.. రతన్ టాటా! | Ratan Tata hospitalised| after significant drop in blood pressure


posted on Oct 7, 2024 1:10PM

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ముంబైని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో రతన్ టాటా తన ఆరోగ్యం మీద ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపించాయని నాకు తెలుసు. ఈ వాదనలు నిరాధారమైనవని అందరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాను. నా వయస్సు సంబంధిత అనారోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను ఉత్సాహంగా వున్నాను. కొంతమంది గౌరవనీయ మీడియా ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నాను’’ అని రతన్ టాటా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.