Leading News Portal in Telugu

జగన్ పుంగనూరు పర్యటన రద్దు! | jagan punganur tour cancelled


posted on Oct 7, 2024 2:19PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి   జగన్‌  మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన  రద్దైంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరులో  హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజూమ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జనగ్ ఈ నెల 9న పుంగనూరు వచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. చిన్నారి హత్యకేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయడంతో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని పెద్ది రెడ్డి సోమవారం (అక్టోబర్ 7)న తెలిపారు.