Leading News Portal in Telugu

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేడే శ్రీకారం


posted on Oct 26, 2024 10:24AM

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శనివారం నుంచి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మంగళగిరిలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు  మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం వందరూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు . లక్ష రూపాయలు కడితే శాశ్వత సభ్యత్వ నమోదు  లభిస్తుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు వల్ల పార్టీ మరింత బలోపేతం కానుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ఐదు లక్షల రూపాయల ఇన్సురెన్స్ ఇవ్వాలని టిడిపి నిర్ణయించింది.  గతంలో రెండు లక్షలు ఉన్న ఇన్సురెన్స్  ఐదు లక్షలకు పెంచింది. చనిపోయిన కార్యకర్తలకు తక్షణ సాయం క్రింద పదివేల రూపాయలు అందిస్తారు