కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు దుర్మరణం | four indies died in road accident| canada| toronto| car| dash
posted on Oct 26, 2024 2:40PM
కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. టొరెంటోలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తరువాత ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో టెస్లా కారులో నలుగురు భారతీయులు ప్రయాణిస్తున్న కారు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు డివైడర్ ను ఢీకొట్టింది.
ఆ వెంటనే కారు బ్యాటరీలో మంటలు చెలరేగి క్షణాలలో కారును కమ్మేశాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురూ సజీవదహనం అయ్యారు. మృతులలో ఇద్దరు గుజరాత్‌లోని గోద్రాకు చెందిన వారుగా గుర్తించారు. గోద్రాకు చెందిన కేతా గోహిల్ (30), నిల్ గోహిల్ (26), మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో ప్రయాణి స్తుండగా ఈ ప్రమాదం జరిగింది.