మంగళగిరి ఎయిమ్స్ లో డ్రోన్ సేవలను ప్రారంభించిన మోదీ | prime minister narendra modi starts drone servieces in mangalagiri aims| virtuval| blood| sample| patient| 12kms
posted on Oct 29, 2024 4:38PM
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం (అక్టోబర్ 29) ప్రారంభించారు. హస్తినలోని ఏఐఐఏ నుంచి వర్చువల్ గా ఆయన ఎయిమ్స్ లో డ్రోన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్సీ వరకూ డ్రోనను పంపించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ఆ డ్రోన్ అక్కడ మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్ కు తిరిగొచ్చింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ముందు ముందు వైద్య రంగంలో వైద్య సేవలను భారీగా వినియోగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవలే విజయవాడలో డ్రోస్ సమ్మిట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో సాంకేతిక వినియోగానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో డ్రోన్ వినియోగాని రాష్ట్ర అభివృద్ధి కోసం విరివిగా వినియోగించే అవకాశలు ఉన్నాయి.
ఇటీవల బెజవాడను వరదలు ముంచెత్తిన సమయంలో వరద బాధితులకు వేగంగా సహాయ పునరావాస కార్యక్రమాలను అందించడంలో డ్రోన్ల ను వినియోగించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు చేరవేయడంలో డ్రోన్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా వినియోగించుకున్న సంగతి విదితమే.