Leading News Portal in Telugu

సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు… రెండు కోట్లు ఇవ్వకుంటే ఖతం | Salman Khan is once again threatened… if he does not give two crores


posted on Oct 30, 2024 12:34PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్​కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామని  ఓ గుర్తు తెలియని వ్యక్తి  ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. దీంతో వర్లీ పోలీసులు అతనిపై  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లారెన్స్‌బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చేతిలో హత్యకు గురైన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్‌సిద్ధిఖీని చంపేస్తామని బెదిరించిన  వ్యక్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల గుఫ్రన్‌ను అరెస్టు చేసిన కొద్ది సేపటికే ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. 

తమకు రూ.5కోట్లు ఇవ్వాలని, లేదంటే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఎన్​సీపీ నాయకుడు జీషన్ సిద్ధిఖీని చంపేస్తామని ఇటీవల బెదిరింపు కాల్ వచ్చింది. . ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో  గుఫ్రన్ ఖాన్​ని మంగళవారం అరెస్టు చేశారు.  ఇది జరిగిన కొద్దిసేపటికే  గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు  మెసేజ్ వచ్చింది. సల్మాన్ ఖాన్​ను ఖతం చేస్తామని మరోసారి బెదిరింపు కాల్  రావడం గమనార్హం.

గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈ-మెయిల్స్ ద్వారా సల్మాన్​​కు హెచ్చరికలు  వచ్చాయి. ఇవి పంపింది  ఎవరో కాదు . కరడుగట్టిన నేరగాడు లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన గ్యాంగ్.  గత సంవత్సరమే ఈ హెచ్చరిక వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ కృష్ణ జింకలను అమితంగా ప్రేమిస్తాడు. కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  కృష్ణజింకలను వేటాడినందుకు సల్మాన్‌ ఖాన్‌ను చంపుతామని ఇప్పటికే ప్రకటించింది బిష్ణోయి గ్యాంగ్. తమ మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని స్పష్టం చేసింది. ఇటీవలే ఎన్​సీపీ నేత, సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. అలాగే సల్మాన్​కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని పలువురికి బెదిరింపు మెసేజ్ లు  పంపింది.