posted on Oct 30, 2024 11:56AM
కడపలో అన్న క్యాంటిన్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అన్న క్యాంటిన్ వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది.
కడప మార్కెట్ యార్డ్ సమీపంలోని అన్న క్యాంటిన్ లో బుధవారం (అక్టోబర్ 30) తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వంటలు చేయకపోవడం, లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి బాయిలర్ ఎగిరిపడింది. భారీ శబ్దంతో పేలుడు జరగడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు.