posted on Nov 4, 2024 4:08PM
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలింది. మంగళగిరి కోర్టు అతనికి రిమాండ్ పొడిగించింది. మహిళ హత్యకేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. నేటితో రియాండ్ ముగియడంతో పోలీసులు అతడిని మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 2020లో రెండు సామాజిక వర్గాల గొడవలో మరియమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్యకేసులో నందిగం సురేష్ 78వ నిందితుడు. ఈ కేసునమోదైన తర్వాత నందిగం అరెస్ట్ అయ్యాడు. తొలుత రెండు రోజుల విచారణలో నందిగంపై ఆధారాలు లభ్యం కావడంతో కోర్టు 14 రోజు ల రిమాండ్ విధించింది. తాజాగా సోమవారం మరో 14 రోజులు రిమాండ్ విధించింది. అంటే ఈ నెల 14 వరకు నందిగం జైల్లో ఉంటాడు.