Leading News Portal in Telugu

హైద్రాబాద్ మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు 


posted on Nov 6, 2024 1:40PM

హైద్రాబాద్ మేయర్ విజయ లక్ష్మి జిహెచ్ ఎంసి  ప్రధాన కార్యాలయంలో  ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో గద్వాల మంగళవారం తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రజా వాణిలో ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. మధ్యాహ్నం 12 వరకు ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి చేరుకోవడం లేదు. ఆలస్యంగా వచ్చిన వారిపై చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు. అధికారుల అటెండెన్స్ చూసి ఆమె సీరియస్ అయ్యారు. అడిషనల్ కమిషనల్ నళినీ పద్మావతికి  అటెండెన్స్ పై రిపోర్ట్ చేయాలని  ఆదేశంచారు. గత మూడు నెలల క్రితం కూడా మేయర్ ఆకస్మక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంట వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలోని  ఏడు ప్లోర్ లలో ప్రతీ డిపార్ట్ మెంట్ ఆమె కలియ తిరిగారు.