ట్రంప్ జయభేరి.. సంబరాలలో మద్దతుదారులు | Donald Trump storms back to White House| US Election Results 2024 Updates| US Election Results 2024| donald trump age| us president donald trump
posted on Nov 6, 2024 3:24PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. హోరాహోరీ తప్పదన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన సునాయాసంగా విజయం సాధించారు. అధ్యక్ష పగ్గాలు అందుకోవడానికి అవసరమై 274 ఎలక్టోరల్ ఓట్లను ఆయన దాటేశారు. గట్టి పోటీ ఇస్తారనుకున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తేలిపోయారు. ఫ్లోరిడా, మిసిసిపి, ఓక్లహోమా, ఇండియానా, కెంటకీ, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, యూటా, వయోమింగ్, నెబ్రాస్కా, మోంటానా, టెన్నిసీ, అలబామా, ఐడహో రాష్ట్రాలలో ట్రంప్ విజయదుందుభి మోగించారు. అలాగే స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినాలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్, నెవడా, విస్కాన్సిన్ రాష్ట్రాలలో కూడా ట్రంప్ సంపూర్ణ ఆధిక్యత కనబరిచారు. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇలా ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు జేడీవాన్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆయన భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందిన వారు. గత ఏడాది వరకూ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. దీంతో ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కానున్నారు. ఉష చిలుకూరి పేరెంట్స్ ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉష ఆమె అక్కడే పుట్టి పెరిగారు.