posted on Nov 6, 2024 8:52AM
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పరిశ్రమ అంతా వ్యాపించాయి.
అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఐదు ఫైర్ ఇంజన్ లతో అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది.