Leading News Portal in Telugu

జేడీ వాన్స్ దంపతులకు చంద్రబాబు ఆహ్వానం | cbn extend invitation to jdwans and usha couple to ap| congrats


posted on Nov 7, 2024 9:34AM

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ విజ‌య‌ఢంకా మోగించింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు వివిధ దేశాధినేత‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.  

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కూడా ట్రంప్‌కు అభినంద‌నలు తెలిపారు.  అదే విధంగా అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్ కు కూడా చంద్రబాబు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఉషా వాన్స్ ఆయన భార్య కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఉషా వాన్స్ విజయం చారిత్రాత్మకం ఆంధ్రప్రదేశ్‌లో మూలాలున్న ఉషా వాన్స్, అమెరికా రెండవ మహిళగా సేవలందించ‌బోతుండటం తెలుగువారందరికీ గర్వకారణం అని చంద్రబాబు మేర్కొన్నారు.  అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంటూ చంద్రబాబు తన అభినందన సందేహంలో పేర్కొన్నారు.