Leading News Portal in Telugu

రేవంత్ మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర | revanth reddy padayatra| musi| renaissance| yadadri


posted on Nov 8, 2024 4:51AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకుంటారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

సమీక్ష అనంతరం సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపడతారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు  పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.