Leading News Portal in Telugu

వైసీపీకి మాజీ మంత్రి కురసాల కన్నబాబు గుడ్ బై? | former minister kurasala kannababu to quit ycp| kakinada| district| president| join


posted on Nov 9, 2024 2:10PM

వైసీపీకి మరో కీలక  నేత గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కురసాల కన్నబాబు వైపీపీని వీడనున్నరని గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ అద్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే కాకుండా పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులోకి రావడం లేదు.

ఇటీవలి ఎన్నికలలో ఓటమి తరువాత కురసాల కన్నబాబు పార్టీలో ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. పార్టీ అధినేత జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ కురసాల కన్నబాబు పార్టీ వ్యవహారాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నేడో రేపో పార్టీని వీడి కమలం కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే కురసాల కన్నబాబు బీజేపీలో చేరేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారనీ,   ఆయన వైసీపీని వీడి కమలం గూటికి చేరడం లాంఛనం మాత్రమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.