Leading News Portal in Telugu

ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ చైర్ పర్సన్ మంజుల రెడ్డి | manjula reddy fets corporation post| recognisation| courage| tdp| stand| party


posted on Nov 9, 2024 3:36PM

తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఆ పార్టీలో పని చేసే కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభిస్తుంది. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన తొలి పార్టీ దేశంలో తెలుగుదేశమే. అలాగే మరణించిన తెలుగుదేశం కార్యకర్తల పిల్లల బాధ్యత పార్టీయే తీసుకుని వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్న పార్టీ కూడా తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడే క్షేత్రస్థాయి కార్యకర్తలను  గుండెల్లో పెట్టుకుంటుంది.

ఇందుకు తాజా ఉదాహరణే మంజులా రెడ్డికి నామినేటెడ్ పోస్టు దక్కడం. గత ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ విచ్చలవిడిగా ఎన్నికల అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడింది. ఆ సమయంలో వైసీపీ  అక్రమాలను ప్రశ్నించిన మంజులా రెడ్డి పై వైసీపీ గూండాలు కత్తులతో దాడి చేసారు. అయినా వెన్ను చూపకుండా, భయపడకుండా ఆమె నిలబడిన తీరు, తెగువను తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందించారు. కేవలం అభినందించి ఊరుకోలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత  ఆమెకు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. శనివారం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఆమె పేరు ఉంది. మంజులారెడ్డికి ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చి ఆమె పార్టీకి చేసిన సేవలకు సముచిత గుర్తింపు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ దౌర్జన్యాల దీటుగా ఎదుర్కొని, దాడులకు వెరవకుండా ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, వారికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందని ముంజులారెడ్డికి పదవి ఇవ్వడం ద్వారా చంద్రబాబు మరోసారి చాటారు.