Leading News Portal in Telugu

సీప్లేన్ లో అరగంటలోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి చంద్రబాబు | cbn reached srisailan in half an hour on seaplans| services| from| march| next


posted on Nov 9, 2024 1:56PM

ఏపీలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి సీప్లేన్ సర్వీస్ కు శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం (నవంబర్ 9)న ప్రారంభించారు. ఆ సందర్భంగా  విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి సీప్లేన్‌ను ప్రారంభించి అందులో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ప్రయాణించారు. 

విజయవాడ పున్నమిఘాట్ నుంచి సీప్లేన్ లో శ్రీశైలం చేరడానికి కేవలం అరగంట సమయం పట్టింది. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు తిరిగి సీ ప్లేన్ లో విజయవాడ తిరిగి వచ్చారు.

 రాష్ట్రంలో   సీ ప్లేన్ సర్వీసులు వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా సీప్లేన్ సర్వీ సు ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ  భవిష్యత్ లో ఎయిర్ పోర్టులకు ప్రత్యామ్నాయంగా సీ ప్లేన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై యోచన చేస్తున్నట్లు తెలిపారు.