ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మై హోమ్ గ్రూప్ అధినేత | myhome group head meets modi| primeminister| presents| lord| venkateswara
posted on Nov 9, 2024 9:51AM
చిన్న స్థాయి నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు.
గురువారం (నవంబర్ 7) వీరు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఆ సందర్భంగా కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని వీరు ప్రధానికి బహూకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్నేహ పూర్వకంగా, మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు.