Leading News Portal in Telugu

ఇది క‌దా ప్ర‌జా పాల‌న అంటే! | speeed progress in andhra pradesh| cbn| vision| knowledge| technology| tourism| dron


posted on Nov 11, 2024 4:27AM

చంద్ర‌బాబు పేరు చెప్ప‌గానే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు టెక్నాల‌జీ ముఖ్య‌మంత్రి, దార్శినికతను అరగుడుల నిదర్శనమని చెబుతుంటారు.  నూత‌న టెక్నాల‌జీని అందిపుచ్చుకొని దానిని    పాల‌నకు అన్వయించి అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయన దిట్ట.   వ‌చ్చే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచం ఏ రంగంలో ముందుకు దూసుకెళ్తుంద‌నే విష‌యాన్ని ప‌సిగ‌ట్టి..  ఆ మేర‌కు విజ‌న్ ను రూపొందించ‌డంలో చంద్ర‌బాబును మించిన‌వారు మరొకరు లేర‌నే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా రాణిస్తున్నారంటే అందుకు చంద్ర‌బాబు ముందు చూపే కార‌ణ‌మ‌ని చెప్ప‌డానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. అలా చెప్పడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. చంద్ర‌బాబు తొలిసారి సీఎం అయిన స‌మ‌యంలో ఐటీ రంగానికి పెద్ద‌పీట వేశారు. హైటెక్ సిటీని నిర్మించి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ఐటీ హ‌బ్ గా మార్చి ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించారు. ఐటీ రంగంలో ఉన్న‌త స్థానాల్లో రాణిస్తున్న తెలుగు వారు అధిక‌ శాతం మంది తాము ఈ స్థాయికి చేరుకోవ‌టానికి చంద్ర‌బాబే కారణమని ఇప్ప‌టికీ చెబుతుంటారు. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీ ముఖ్య‌మంత్రిగా ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. టెక్నాల‌జీని ఉప‌యోగించి అనేక అద్భుత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. వ్య‌వ‌సాయ రంగంలోనూ రైతులు టెక్నాల‌జీని  అందిపుచ్చుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే, 2019లో జగన్ ప్ర‌భుత్వం రావ‌డంతో ఏపీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. 

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో టెక్నాల‌జీ వినియోగం లేదు, అభివృద్ధి లేదు. చాలా మంది ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఏపీకి తీసుకొచ్చిన కంపెనీల‌ు సైతం జగన్ అరాచక పాలన, అధ్వాన విధానాల కారణంగా ఏపీ నుంచి తరలిపోయాయి. దీంతో ఏపీ అన్ని రంగాల్లో వెనుక‌బ‌డిపోయింది. జగన్ హయాంలో రాష్ట్రం పురోగమించడం అటుంచి అన్ని రంగాలలోనూ తిరోగమించి  దేశంలోనే చివరి నుంచి మొదటి స్థానానికి దిగజారిపోయింది. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో కేవ‌లం తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లపై అక్ర‌మ కేసులు, దౌర్జన్యాలు, దాడులకే ప్రభుత్వం పరిమితమరైంది. ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించిన వారిని జైళ్ల‌కు పంపించ‌డమే లక్ష్యంగా జగన్ పాలన సాగింది. జ‌గ‌న్ క‌క్ష‌ పూరిత పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే కూట‌మికి ప‌ట్టం క‌ట్టారు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు.. అప్పుల కుప్ప‌గా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అంతేకాదు.. నూత‌న సాంకేతికతను అంది పుచ్చుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికే ఆద‌ర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. 

చంద్ర‌బాబు చొర‌వ‌తో సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వం ముందుంటోంది. గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా అన్ని రంగాలూ టెక్నాలజీ వినియోగంతో ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా విధానాలు రూపొందిస్తున్నారు. అమలు చేస్తున్నారు.    విప‌త్తుల స‌మ‌యంలో డ్రోన్ల‌ను వాడి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించారు. దేశంలోనే తొలిసారిగా ప‌ర్యాట‌క రంగంలోకి విజ‌య‌వంతంగా సీప్లేన్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా అవ‌కాశం ఉన్న అన్నిరంగాల్లో టెక్నాల‌జీని ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించేలా సీఎం చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని అవ‌స‌రాల‌కే వినియోగిస్తున్న డ్రోన్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వినూత్నంగా వాడుకుంటున్నది. 

గ‌త సెప్టెంబ‌ర్ లో విజ‌య‌వాడ‌ భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తిన స‌మ‌యంలో డ్రోన్ల‌ను ఉప‌యోగించి వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం అందించారు. డ్రోన్ల‌ను ఇలా వినియోగించ‌డం దేశంలోనే తొలిసారి.  చంద్ర‌బాబు తెలివి తేట‌ల‌తో మ‌నుషులు వెళ్ల‌లేని ప్రాంతాల‌కు డ్రోన్ల ద్వారా బాధితుల‌కు ఆహార పొట్లాలు, తాగునీటి బాటిల్స్‌ అందించారు. డ్రోన్ల‌ను వ్య‌వ‌సాయ రంగంలోనూ విస్తృతంగా వినియోగించేలా ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కృష్ణా న‌ది తీరంలో ఐదు వేల డ్రోన్ల‌తో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న  ఐదు విభాగాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు  న‌మోదు చేసింది. ఓర్వ‌క‌ల్లులో డ్రోన్ హ‌బ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్ర‌పంచ డ్రోన్ డెస్టినేష‌న్ గా ఏపీని నిలపాలని భావిస్తున్నారు. 

తెలుగు వారు ఊహించ‌ని విధంగా ప‌ర్యాట‌క రంగంలో సీ ప్లేన్‌ను వినియోగించాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. అసలు 2017 డిసెంబ‌ర్ లోనే సీ ప్లేన్ వినియోగంపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఆ త‌రువాత కాలంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ ప్రాజెక్టుకు ముందుకు సాగ‌లేదు. వైసీపీ హ‌యాంలో ప‌ర్యాట‌క రంగంలో అభివృద్ధి కుంటుప‌డింది. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంటాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు.  2024 ఎన్నికలలో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడంతోనే రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు. అందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఇటీవ‌ల విజ‌య‌వాడ  శ్రీ‌శైలానికి సీ ప్లేన్ ను ప్రారంభించారు చంద్ర‌బాబు. అందులో ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌టించారు. దేశంలోనే సీ ప్లేన్ లో ప‌ర్య‌టించిన మొద‌టి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు గుర్తింపు పొందారు. దూర‌దృష్టితో అన్ని రంగాల్లోనూ టెక్నాల‌జీని సీఎం చంద్ర‌బాబు ప‌రుగులు పెట్టిస్తున్నారు. చంద్ర‌బాబు  నిర్ణ‌యాలు కార్యాచరణ అంద‌ర్నీ అబ్బుర పరుస్తున్నాయి.