అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన పయ్యవుల | payyavula keshav present budget in apassembly| finance| minister| budget| session
posted on Nov 11, 2024 9:00AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. ఇక శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్ల వైసీపీ ఇప్పటికే ప్రకటించింది.
బడ్జెట్ ప్రవేశానికి ముందు ఆర్థిక శాఖ అధికారులు మంత్రి పయ్యావుల కేశవ్ కు బడ్జెట్ పత్రాలు అందజేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ వాటికి పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. బడ్జెట్ గురించి ఆయనకు వివరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం నాలుగు నెలల పాటు ఓటాన్ అక్కౌంట్ మీదే పాలన సాగించింది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా, అధ్వానంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ సమయం తీసుకున్నది. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్.. బడ్జెట్ రూపకల్పనలో అభివృద్ధి , సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయించారు. అలాగే ఇరిగేషన్, రోడ్లు, పెన్షన్ లు, దీపం పథకం, అన్న క్యాంటిన్ పథకాలకు నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పోలవరం నిర్మాణం, అమరావతి పనులకు నిధుల లేమి లేకుండా నిధులు కేటాయించడంపై పయ్యావుల కేశవ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మైలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సమాచారం. అలాగే పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపుపై కూడా బడ్జెట్ రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది.