Leading News Portal in Telugu

పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ … రాజకీయాల నుంచి   నటుడిగా మారిన ఈ మాజీ క్రికెటర్ 


posted on Nov 11, 2024 10:18AM

పాడి కౌశిక్ రెడ్డి. ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో  మారు మ్రోగిపోతుంది, గతంలో  పిఏసీ చైర్మెన్  పదవిఅరికెపూడికి రేవంత్ సర్కారు ఇవ్వడంతో ఒంటి కాలిపై లేచినంత పని చేశాడు. పాడి కౌశిక్‌ రెడ్డి హైదరాబాద్ జట్టుకు దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించాడు. అయన తన తొలి మ్యాచ్ ను పంజాబ్ తో  తలపడ్డాడు. 2004 డిసెంబరు 22 వతేదీన ఈ మ్యాచ్  ఆడాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా, మీడియం పేసర్ గా జట్టుకు సేవలందించాడు. ప్రస్తుత రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్  అని చెప్పొచ్చు. తన స్వంత పార్టీకి చెందిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి కాంగ్రెస్ వైపు చూసినప్పుడు కౌశిక్‌ రెడ్డి పావుగా కెసీఆర్ గేమ్ ఆడారు. కెసీఆర్ కనుసన్నల మీదే కౌశిక్ రెడ్డి అరికెపూడిపై చెలరేగిపోయారు. బిఆర్ ఎస్ జెండాపై గెలిచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారని బిఆర్ ఎస్ నేతలను  గట్టిగా నిలదీసిన ఏకైక  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అని చెప్పొచ్చు. తన చివరి మ్యాచ్ 2007లో ఆడి, క్రికెట్ నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు.  ఆయన  రాజకీయ గురువు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి రాజకీయ గురువు ఉత్తమ్  కుమార్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి  ఓవర్ నైట్ లో బిఆర్ఎస్ లో చేరిపోయారు.హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ చేతిలో  ఘోరంగా ఓడిపోయారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈటెల రాజేందర్ పై బిఆర్ ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఈటెల వంటి పవర్ పుల్ పొలిటిషియన్   రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటున్న కౌశిక్ రెడ్డి చేతిలో  ఓడిపోవడంతో  చర్చనీయాంశమయ్యారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ దృష్టిలో పడ్డ  కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో జంప్ అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. కెసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని రెచ్చిపోయారు. 

పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ నటనలో ఆరితేరిపోతున్నారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ లో పెట్టిన దళిత బంధు నిధుల్ని ఇవ్వాలని తాజాగా ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆయన కోసం వందల మంది రాలేదు. పట్టుమని పది మంది కూడా లేరు. కానీ పోలీసుల సాయంతో..తన సోషల్ మీడియా టీం క్రియేటివిటీతో ఆయన చేసిన రచ్చ చూసి అందరూ ఔరా అనుకున్నారు. కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా స్టార్ గా మారి పోయారు.  ఆయన పండించిన సన్నివేశాల్లో స్పృహ తప్పడం దగ్గర నుంచి ఆస్పత్రిలో చొక్కా విప్పేసి మీడియాతో మాట్లాడటం చివరికి చేతికి కట్టుతో బయటకు రావండి వరకూ చాలా ఉన్నాయి. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. నన్ను హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన రాజకీయ నేత కౌశిక్ రెడ్డి.  

తనను గెలిపించకపోతే  ఎన్నికల రోజు  ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్  చేశారు. అప్పట్నుంచి ఆయన కామెడీ స్టార్ గా మిగిలిపోయారు. పీఏసీఎ చైర్మన్ వివాదంలో ఆయన పై దాడి జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో తన్నులు తిని హస్య సన్నివేశాన్ని పండించారు. రేవంత్ రెడ్డి వీడియోలు తన వద్ద ఉన్నాయని కౌశిక్ రెడ్డి అంటున్నారే గానీ వాటిని బయటపెట్టకపోవడం బట్టి ఆయన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నారు.