Leading News Portal in Telugu

రూ. 2.94 లక్షల కోట్లతో పయ్యావుల బడ్జెట్ | payyavula keshav present budget in apassembly| finance| minister| budget| session


posted on Nov 11, 2024 10:12AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (నవంబర్ 11) ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంబించారు. రూ. 2.94 లక్షల కోట్లతో ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 

పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.

ఉన్నత విద్య –  రూ. 2326 కోట్లు

ఆరోగ్యం – రూ.18421 కోట్లు. 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – రూ. 16 వేల 739 కోట్లు  

పట్టణాభివృద్ధి- రూ. 11490 కోట్లు

గృహనిర్మాణం –  రూ. 4012 కోట్లు

ఇరిగేషన్ – రూ. 16 వేల 705 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం – 3127 కోట్లు

ఇంధన రంగం –  రూ. 8,207 కోట్లు

రోడ్లు, భవనాలు – రూ. 9554 కోట్లు

యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ 322 కోట్లు

పోలీసు శాఖ – రూ.8495

పర్యావరణం, అటవీ శాఖ- రూ. 687 కోట్లు

ఎస్సీ సంక్షేమం – 18, 497 కోట్లు

ఎస్టీ సంక్షేమం- రూ. 7557 కోట్లు

బీసీ సంక్షేమం – రూ.39007 కోట్లు

మైనారిటీ సంక్షేమం – రూ. 4376 కోట్లు

మహళాభివృద్ధి, శిశుసంక్షేమం – రూ. 4285 కోట్లు

మానవవనరులు, నైపుణ్యాభివృద్ధి – రూ. 1215 కోట్లు

పాఠశాల విద్య – రూ.29908 కోట్లు