బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు | brs former mla patnam narender reddy arrest| lagacharla|attack
posted on Nov 13, 2024 7:41AM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రతీక్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోనికి తీసుకున్నారు.
లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై స్థానికులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్ కార్యకర్త సురేశ్ రాజ్ పరారీలో ఉన్నాడు. సురేష్ రాజ్ వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నారనే ప్రాథమిక సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. కలెక్టర్‌పై దాడికి ముందు, తర్వాత నరేందర్ రెడ్డితో సురేశ్ రాజ్ దాదాపు 40 సార్లు ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు.