posted on Nov 13, 2024 11:52AM
దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్రమోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్ఠానంలో నిలిచారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్లు తెలిపింది.దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తిమంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి, జైలుకెళ్లినా 2024 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. సొంతంగా 16 మంది లోక్‌సభ సభ్యులు, కూటమిపార్టీలతో కలిపి రాష్ట్రంలో 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో తెదేపాను రెండో అతి పెద్ద పెద్దపార్టీగా నిలపగలిగారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న చంద్రబాబు, రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్రచూపుతూ ముందుకెళ్తున్నారు. తర్వాతి స్థానాల్లో బిహార్ సీఎం నీతీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, బంగాల్ సీఎం మమతాబెనర్జీ తదితరులున్నారు.