Leading News Portal in Telugu

అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజు ఏకగ్రీవం | td[ mla raghurama krishnamraju elected unanimously as assembly deputy speaker| speaker| ayyannapatrudu


posted on Nov 14, 2024 2:04PM

వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రఘురామకృష్ణంరాజు ఏకగ్రీవ ఎన్నికలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం సభలో ప్రకటించారు.

డెప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజు కూటమి నేతలు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పదవికి మరెవరూ నామినేషన్లు వేయకపోవడంతో  ఆయన ఎన్నిక లాంఛనమే అయ్యింది. దీంతో రఘురామకృష్ణం రాజు అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ గా  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం (నవంబర్ 14) సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.